Sep 28,2023 20:31

విచారిస్తున్న డిఎస్‌పి గోవిందరావు

ప్రజాశక్తి - పూసపాటిరేగ :  మండలంలోని చింతపల్లిలో బుధవారం అర్ధరాత్రి చిరు వ్యాపారి మొంగం మూర్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగలు చోరీకి యత్నించారు. ముగ్గురు దొంగలు ఇంట్లోకి వెనక డోర్‌ నుంచి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించగా హాల్లో పడుకున్న మూర్తి తల్లి దమయంతి లేచి కేకలు పెట్టింది. పక్క గదిలో పడుకున్న మూర్తి వచ్చేసరికి దొంగలు ఆమెపై దాడి చేస్తున్నారు. మూర్తిని ఆయన తల్లిను కిందన పడేసి దొంగలు కొట్టి పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ముగ్గురు దొంగలు కర్రలతో దాడి చేయడం సీసీ కెమెరాలు చూసిన ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను దొంగతనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విలువైన వస్తువులేవీ పోలేదని, ప్రతిరోజు డబ్బులు సేవ్‌ చేసుకునే హుండీ ఎత్తికుపోయారని పోలీసులకు తెలిపారు. హుండీలో సుమారుగా రూ.20వేలు వరకు ఉండొచ్చని పోలీసులకు చెప్పారు. పోలీస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ఇంటికి డాగ్స్‌స్క్వేడ్‌తో పాటు క్లూస్‌ టీం కూడా వచ్చి దర్యాప్తు చేస్తుంది.