Mar 17,2023 21:10

ప్రజాశక్తి - చింతలపూడి
               మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎంపిపి రాంబాబు అన్నారు. మండలంలోని రాఘవపురం, ఎండపల్లి గ్రామాల్లో అంగన్‌వాడీ సెంటర్లను, ఆర్‌సిఎం పాఠశాలను, యండవల్లి సచివాలయాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడి సెంటర్లో చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మోహన్‌రావు పాల్గొన్నారు.