Jul 17,2023 00:06

విజయపురిసౌత్‌: మాచర్ల మండలం చింతలతండ గ్రామంలో మాచర్ల శాసనసభ్యులు ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైయస్సార్‌ జలకళ పథకం ద్వారా రైతు పొలాలలో బోర్లకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల పక్షపాతి, రైతుల మేలుకోరే, అలాగే రైతులకు అండగా ఉండే ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమని, పేద రైతులు వ్యవసాయం చేయుటకు వర్షాలపైన ఆధారపడకుండా పంట పండించే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు శేరెడ్డి గోపిరెడ్డి, మాచర్ల జడ్పిటిసి మల్లు స్వామి, మాచర్ల మండల వైసీపీ నాయకులు బూడిద శ్రీను, మాచర్ల మండలం వాలంటీర్ల చైర్మన్‌ వీరారెడ్డి,శెరెడ్డి చింతల తండా సర్పంచ్‌ కేతావత్‌ శీను నాయక్‌, ఎంపీటీసీ సీత నాయక్‌ పాల్గొన్నారు.