ప్రజాశక్తి -నర్సీపట్నం రూరల్:తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజరు ఈనెల 27న మంగళగిరి సిఐడి ఆఫీస్‌లో విచారణకు హాజరు కావాలని 41ఎ నోటీసును శుక్రవారం ఏపీ సిఐడి పోలీస్ అధికారులు నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద అందజేశారు. విజరు ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి చింతకాయల పద్మావతికి నోటీస్ ఇచ్చి సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐడి పోలీసులు మాట్లాడుతూ, గతంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు కేసు నెంబర్ 14/2022 సంబంధించి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ చింతకాయల విజరుకు 41ఎ నోటీసు హైదరాబాదులోని ఆయన ఇంటి దగ్గర ఇవ్వడం జరిగిందని, విచారణకు హాజరు కాలేదన్నారు. మరొకసారి ఈ కేసుపై 41ఎ నోటీసు అందజేశామన్నారు. విజరు అందుబాటులో లేక పోవడంతో తల్లి పద్మావతికి నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు.










