ప్రజాశక్తి-అద్దంకి: జీవో నెంబర్ 7 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ రఘురామకృష్ణంరాజు, ప్రముఖ మాజీ న్యాయమూర్తి అయిన జడ శ్రావణ్ కుమార్‌చే కళాకారుల తరఫున హైకోర్టులో వాదన వినిపిస్తున్నారు. అద్దంకి నాట్యమండలి, బాపట్ల జిల్లా కళాకారుల సంఘం తరఫున అధ్యక్షులు గోవాడ శ్రీకాంత్ విజయవాడలో జడ శ్రావణ్ కుమార్ వారి క్యాంప్ ఆఫీస్‌లో కళాకారులతో మర్యాదపూర్వకంగా కలిశారు. చింతామణిపై విధించిన నిషేధం ఈ నెలాఖరుకి హైకోర్టు న్యాయస్థానం వారు కళాకారులు అనుకూలంగా తీర్పు వస్తుందని కళాకారులతో జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వంజా సుబ్బారావు, చేబ్రోలు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.










