ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని చిలకలడోన గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నివారణకు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి హెచ్.జయరాజు, నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్ తాలూకా ఇన్‌ఛార్జీ దేవిపుత్ర మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చలికాలంలోనూ తాగునీటి ఎద్దడి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకునే నాథుడే కరువయ్యారని తెలిపారు. సుమారు 5 వేలకు పైగా ఉన్న కుటుంబాలకు 2 బోర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అవి కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. నీటి కోసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్ల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉందన్నారు. వృద్ధులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్‌ఎపి నుంచి నీరు రాక నెల రోజులు కావస్తోందని చెప్పారు. అధికారులు స్పందించి ఎన్‌ఎపి నుంచి ప్రజలకు నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలందరినీ కూడగట్టి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్‌డి.షఫీ సానియా, ఫిర్ దోష్, అంజి, రాఘవేంద్ర పాల్గొన్నారు.