Sep 04,2023 00:33

అవగాహన కల్పిస్తున్న గ్రంథాలయ అధికారి


ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: స్థానిక శాఖా గ్రంధాల యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్స్‌ క్లబ్‌తో పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లైబ్రేరియన్‌ పి.దమయంతి పేర్కొన్నారు. ఆదివారం గ్రంధాల యంలో నిర్వహించిన చిల్డ్రన్స్‌ క్లబ్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పాఠశాల సెలవుల సమయంలో లైబ్రరీలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. ప్రతి ఆదివారం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పిల్లలు పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. చిల్డ్రన్స్‌ క్లబ్‌ లో భాగంగా పిల్లలు కథల పుస్తకాలు చదవడం, స్పోకెన్‌ ఇంగ్లీష్‌లో మెళుకువలు నేర్పించారు. విశ్రాంత వ్యాయామ ఉపాద్యాయుడు పి. ప్రభాకరరావు పిల్లలకు చంద్రయాన్‌ 3పై అవగాహన కల్పించారు.