ఆర్థిక సాయం అందజేస్తున్న టిడిపి శ్రేణులు
ప్రజాశక్తి-నగరం: మండల పరిధిలోని పూడివాడ గ్రామ పంచాయతీ పడమటి పాలెం గ్రామానికి చెందిన లచ్చి సాంబయ్య ఇటీవల తాడిచెట్టు ఎక్కి జారి కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనకు టిడిపి సాయం అందజేసింది. బాధితుడు లచ్చి సాంబయ్యకు స్థానిక శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ చికిత్స నిమిత్తం రూ.20,000 పంపగా వాటితో పాటు పూడివాడ మాజీ ఎంపిటిసి సభ్యులు బాలకోటేశ్వరరావు ఇచ్చిన రూ.5,000 సాయాన్ని కలిపి సాంబయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయమందించినవారిలో నగరం మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, టిడిపి నగరం మండల అధ్యక్షుడు చింతల వెంకట సుబ్బారావు, పూడివాడ మాజీ ఎంపిటిసి బాలకోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కాసాని శ్రీనివాసరావు, మోర్ల శ్రీనివాసరావు, యార్లగడ్డ కృష్ణారావు, మట్టా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.










