Feb 13,2023 21:01

మృతురాలు జయలక్ష్మి

చికిత్స పొందుతూ కోలుకోలేక మహిళ మృతి

ప్రజాశక్తి రుద్రవరం.

     మండలంలోని డి కొట్టాల గ్రామానికి చెందిన జయలక్ష్మి (23) అనే మహిళ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పెద్దపల్లె రామలింగమ్మ చిన్న కూతురు జయలక్ష్మిని అవుకు మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన కాటసాని నరేంద్ర రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి సుమారు 8 నెలల క్రితం వివాహం జరిపించారన్నారు. గత కొంతకాలం నుండి జ్వరము నిద్ర సమస్య తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండదని ఆస్పత్రులకు తిప్పి వైద్యుల చేత వైద్య పరీక్షలు చేయించి మందులు వాడిన తగ్గకపోవడంతో తీవ్రంగా బాధపడుతుండదన్నారు. గత నాలుగు రోజుల క్రితం అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి వచ్చిందని ఈ క్రమంలోనే తనకు ఉన్న ఆరోగ్య సమస్యలు నయం కావడం లేదని దీంతో చావే శరణ్యమని తల్లిదండ్రులతో చెప్పి బాధపడుతుండడంతో తల్లిదండ్రులు నయమవుతుంది లేమ్మా మేము చూపిస్తామని చెప్తుండేవారని తెలిపారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు పంట పొలానికి వెళ్లడంతో జీవితంపై విరక్తి చెందిన జయలక్ష్మి ఇంట్లో ఎవరు లేని సమయంలో పంట పొలాలకు చల్లె గుళికలు మింగే ఆత్మహత్యయత్నానికి పాల్పడంతో సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఉదయానంద ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తుండగా కోలుకోలేక మృతి చెందిందన్నారు. తల్లి రామలింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.