చికెన్ షాప్ యజమానులు
నిబంధనలు పాటించాలి
మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్
ప్రజాశక్తి-డోన్
డోన్ పట్టణంలోని చికెన్ షాప్ యజమానులు అందరూ మున్సిపాలిటి నిబంధనలు పాటించాలని డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ సూచించారు. సోమవారం డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ అధ్యక్షతన పట్టణంలో చికెన్ షాప్ లలో అధిక ధరల కు చికెన్ విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు మున్సిపల్ కార్యాలయం నందు చికెన్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్చిన చికెను రూ.200, కాల్చని చికెన్ రూ.180లుగా విక్రయించాలని షాపు యజమానులకు ఆదేశించారు. చికెన్ వ్యర్థపదార్థా లను కాలువలలో ఖాళీ ప్రదేశాలలో వేయకూడదని సూచించారు. చికెన్ వ్యర్థపదార్థాలను మున్సిపల్ శాఖ వారికి అప్పగించాలని సూచించారు. నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు,పట్టణ ఏఎస్‌ఐ గోపాల్, చికెన్ షాప్‌ల యజమానులు పాల్గొన్నారు.










