ప్రజాశక్తి - చీరాల
చైల్డ్ అండ్ బాండెడ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రభుత్వం, పోలీస్, సిఐడిస్, లేబర్ మరియు లైన్ డిపార్ట్మెంట్స్ డ్రైవ్ నిర్వహించారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని పోలీస్, లేబర్ డిపార్ట్‌మెంట్, షాడోస్ స్వచ్ఛంద సంస్థ బుధవారం నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పునరావాసం నినాదంతో తనిఖీలు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆపరేషన్ స్వేచ్ఛ నిర్వహించారు. హోటల్స్, మెకానిక్ షెడ్స్‌లో తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో స్టేషన్ కమాండర్ శ్రీనివాసరావు, సిటిఐ శ్రీనివాసులు కలిసి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రైలులో ప్రయాణించేటప్పుడు అనుమానాస్పద వ్యక్తులు ఎవరినైనా కనిపిస్తే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని షాడోస్ సంస్థ ప్రతినిధి రాజా సాల్మన్ అన్నారు. బాలకార్మికులు, మానవ అక్రమ రవాణా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. స్వేచ్ఛ, హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చీరాల, పర్చూరు కార్మిక అధికారులు రామకృష్ణ, అబ్రహం, పోలీస్ శాఖ రాజు, షాడోస్ ప్రతినిధి ఏ రాజా సువి సాల్మన్, బి భాగ్యలక్ష్మి, కుసుమ పాల్గొన్నారు.










