Jul 09,2023 01:24
ఏపి హైకోర్టు జడ్జి మన్మథరావును సన్మానిస్తున్న బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి-చీరాల: చీరాల కోర్టును ఏపీ హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి కె మన్మథరావు శనివారం ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి భారతితో కలిసి కోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి చీరాల న్యాయ మూర్తులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మొక్కలతో, పుష్పగుచ్చాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కోర్టు సందర్శన కార్యక్రమం అనంతరం చీరాల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గౌరవ రమేష్‌ బాబు అధ్యక్షతన ఏపీ హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి కె మన్మథరావుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాదులు పలువురు మాట్లాడుతూ చీరాల కోర్టులో గతంలో 6 కోర్టులు ఉన్నాయని కాలక్రమేణ మూడు కోర్టులు జరుగుతున్నాయని అన్నారు. ఏడీజే కోర్టు, అదనపు కోర్టులు కావాలని తద్వారా లిటికల్‌ పబ్లిక్‌కు సత్వరమే న్యాయం చేకూరుతుందని, పలు సమస్యలను ఆయనకు విన్నవించి అభ్యర్థిస్తూ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయనను సత్కరించారు. సత్కార కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి సుధా, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రెహనా, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి నిషాద్‌నాథ్‌, ఎస్టిసి మెజిస్ట్రేట్‌, మరియు సీనియర్‌ న్యాయవాదులు బండారుపల్లి హేమంత్‌ కుమార్‌, కరేటి రవికుమార్‌రెడ్డి, టిజె సాయిబాబా, ఎంవీ చలపతిరావు, రావుల రమేష్‌ కుమార్‌, కర్నేటి రవి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి రమేష్‌ బాబు, వైస్‌ ప్రెసిడెంట్‌ విజయలక్ష్మి, ముద్దన సురేష్‌ చౌదరి, ఎం రవి సిరాజ్‌ ఎన్‌ రామకోటేశ్వరరావు, ఫణి, నాగ్‌ ఏ మనీ నాగ సేన పలువురు సభ్యులు పాల్గొన్నారు.