Aug 15,2023 21:54

నరికివేసిన చీనీచెట్టు

ప్రజాశక్తి బత్తలపల్లి : తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలోని రైతులకు చెందిన చీనీచెట్లను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి నరికివేశారు. గ్రామానికి చెందిన చిన్న గంగన్న కుమారుడు మల్లికార్జున పొలంలో సాగు చేసిన చీనీతోటలోని 23 చీనీచెట్లును సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు కరెంట్‌ రావడంతో మోటార్లు ఆన్‌ చేయడానికి మల్లికార్జున చీనీచెట్లను నరికి వేసి ఉండటాన్ని గమనించాడు. సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్‌ఐ టీవీ శ్రీహర్ష సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు