May 30,2021 14:11

గతానికీ భవిష్యత్తుకీ నడుమ
బలహీనపడుతూ
ఊపిరాడక కొట్టుకుంటోంది
వర్తమానం

ఊహల ఉల్లిపొరలను
వలుస్తుంటే
తెలియని బ్రతుకుభయం
గజగజావణికిస్తోంది

మునుపటి దిగుళ్ళు
కాస్తకాస్తగా వెలిసిపోతూ
జాబితాలోకి
సరికొత్తవి వచ్చి
గుండెల మీద నెగళ్ళను
రాజేస్తున్నాయిజి

అందమైన కలలు కనే కళ్ళు
దుస్స్వప్నాలను ప్రసవిస్తూ
కనుకుపిట్ట రెక్క విరిగి
మాటిమాటికీ ఉలికిపడుతోంది

నడుస్తూ పోతున్న దారులన్నీ కుంచించుకుపోయి
అరక్షణంలో హఠాత్తుగా
మాయమైనట్టుజి
తుపానులన్నీ నోరుతెరచి
నడిసముద్రంలో పడవ
తునాతునకలైనట్టుజి
ఎంత ఈదినా
తీరం ఎప్పటికీ అగుపడనట్టు
పదునైన ఆలోచనలను
మనసును
ఛిద్రం చేస్తున్నాయి

కాలం పెనంపై కాలుతూ
శ్వాస వేడినిట్టూర్పులను
స్రవిస్తోంది

ఏడాదికి సమసిపోతుందనుకున్న
రాకాసినీడ
వెయ్యిచేతులు చాచి
విస్తరిస్తూజి
చీకటిగుడ్లను పొదుగుతూ
పోతోంది
తళతళలాడుతూ వచ్చిన
కొత్త కాలెండరు సైతం
నిశ్శబ్దంగా దహించుకుపోతోంది

- పద్మావతి రాంభక్త
99663 07777