Jan 04,2023 22:44

ప్రజాశక్తి-విజయవాడ రూరల్‌ 

జగన్‌ నిరంకు శత్వ పాలనలో చీకటి జిఓ జారీ చేయడం దూర్మార్గపు చర్య అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయకూడదా అని ప్రశ్నించారు. కేశినేని ఫౌండేషన్‌ ద్వారా విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి కాలనీలో జరిగిన మెగా మెడికల్‌ క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచిత కళ్ళజోళ్ళ పంపిణి కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, కేశినేని శివనాద్‌ (చిన్ని), బుద్దా వెంకన్న లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గానికి పర్యటనకు వెళితే వాహనాన్ని, సిబ్బందిని పోలీసు స్టేషన్‌లో పెడతారా ? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో తిరగకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం అని అన్నారు.