నా గుండెల్లో గునపం దింపినప్పుడల్లా
గుట్టుగా ప్రాణం పోసే దేవతవు
ప్రాణం తెగిపోతుంటే ప్రేమ మతం పోస్తావు
ఊరు బావి ఊట చెరువులే కదా
మనం ప్రేమపక్షులమై వాలిన ఆనవాలు
ఊరు బావి ఊట చెరువు ప్రేమ తీపి జ్ఞాపకం
జానపదాలలో పిలిచిన నీ పిలుపులే
నిన్ను నా నెరజాణగా మలిచినాయి
మోటుమాటలే మన ప్రేమకు దివిటీలు
నిన్ను చూసిన కళ్లతో ఎటు చూసినా
ప్రియా నీ రూపమే దర్శనమిస్తుంది
నీ రూపం నా కండ్లతెరై కదులుతుంది
నీవు కదలని కనువిందైన శిల్పానివై
నన్ను కాలంతో పాటు కదిలే కవిని చేశావు
ప్రేయసి రూపం ప్రేరణ కవిత్వం
నా స్మ ృతి చిత్రకళా ప్రదర్శనలో
నీ చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణ
నీ చిరునవ్వు నా ప్రేమ చిహ్నం
ఉప్పరి తిరుమలేష్
96189 61384