Jul 28,2023 20:41

కెసి కెనాల్‌

 చాపాడు : శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమంగా పెరుగుతూ వస్తూ ఉండటంతో కెసి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. వరి వంగ డాలను సేకరించే పనిలో నిమగ మౌతున ా్నరు. గత ఏడాది జులై రెండవ వారానికి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఆగస్టు మెదటి వారంలో కెసి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో గత వారంలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. రెండు రోజుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నీటిమట్టం పెరుగుతోంది. 30వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరింది. ఈ నెల చివరకు ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీరు చేరితే శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరుగుతుందని రైతులు అంచనాలు వేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 809 అడుగులు ఉంది. ఎగువ నుండి నీటి ప్రవాహం అధిక ంగా ఉంటే ఆగస్టు రెండవ వారానికి కెసి కాలువకు తప్పక నీరు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కుందూ, పెన్నా పరిధిలో ఇప్పటికే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగమై విత్తనాలు, ఎరువులు సేకరించే పనిలో పడ్డారు. సకాలంలో నీరు విడుదల అయితే కెసి, కుందూ పరిధిలో మండల వ్యాప్తంగా 16వేల ఎకరాలలో వరి పైరు సాగు అయ్యే అవకాశం ఉంటుంది.