Aug 19,2023 20:56

జూనియర్‌ వైద్యులకు శిక్షణ ఇస్తున్న డాక్టర్‌ హరికిషన్‌


కడప అర్బన్‌: చెవి శస్త్ర చికిత్సపై జూని యర్‌ ఇఎ న్‌టి వైద్యులకు శిక్షణా సదస్సును ఏర్పాటు చేశామని విజయ ఇఎన్‌టి చైల్డ్‌ కేర్‌ ఆసుపత్రి ఎమ్‌డి డాక్టర్‌ వి.హరికిషన్‌ అన్నారు. శనివారం విజయ ఇఎన్‌టి ఆసుపత్రిలో శిక్షణ కార్యక్రమాన్ని ఎపిఎంసి పరిశీలకులు, రిమ్స్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ భాస్కరన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వి.హరికిషన్‌ మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడాది శిక్షణ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జూనియర్‌ వైద్యులు హాజరయ్యారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎపి మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందిస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఇఎన్‌టి వైద్యుల సహకారంతో రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. సహకరించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చెవి ఎముక ద్వారా ఎలా శస్త్రచికిత్స చేయాలో తెలియజేశామని చెప్పారు. శిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. అన్నిరకాల సదుపాయాలతో శిక్షణ ఇచ్చా మని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ అమరనాధ్‌, డాక్టర్‌ పురుషోత్తం, ఐఎంఎ అధ్యక్షులు, సీనియర్‌ ఇఎన్‌టి వైద్యులు డాక్టర్‌ ఫరూక్‌, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ సురేంద్రబాబు, డాక్టర్‌ శేషశయనారెడ్డి పాల్గొన్నారు.