Sep 20,2023 23:42

ప్రజశక్తి - చీరాల
వందేళ్ల చ‌రిత్ర ఉన్న కొత్తపేట పంచాయతీలోని మ‌ర్రిచెట్టును న‌రికిన వ్య‌క్తుల‌పై ఉన్నత అధికారులను సంప్రదించి చ‌ర్య‌లు తీసుకుంటామని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ర‌మేష్‌బాబు అన్నారు. చెట్టు తొలగింపుకు నిరసనగా వేట‌పాలెం మండ‌లం కొత్త‌పేట పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ద్ద గ్రామ‌స్థులు ఆందోళ‌న చేశారు. వందెళ్ల‌కుపైగా చ‌రిత్ర ఉన్న మ‌ర్రిచెట్ట‌ను కొంద‌రు స్వ‌లాభం కోసం న‌రికివేయ‌డం దుర్మ‌ర్గ‌మ‌న్నారు. గ్రామంలో ఎవ‌రైనా చ‌నిపోతే అంతిమ క్ర‌తువును ఈ చెట్టువ‌ద్దే నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా పాటిస్తున్నారని తెలిపారు. అక్క‌డ ఉన్న భూముల‌ను అమ్ముకునేందుకు చెట్టు అడ్డ‌మైంద‌నే నెపంతో కొంద‌రు బ‌ల‌మైన నేత‌ల అండ‌తో చెట్టును కొట్టేశారని ఆరోపించారు. చెట్టును న‌రికే స‌మ‌యంలో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన  మ‌హిళ‌ల‌పై కూడా దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని తెలిపారు. ఈ విష‌య‌మై పంచాయితీ సెక్ర‌ట‌రీ ర‌మేష్ బాబు మాట్లాడుతూ చెట్టు నరేందుకు పంచాయ‌తీ అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. గ్రామ‌స్థుల త‌మ దృష్టికి తీసుకురావ‌డంతో చెట్టు న‌రికిన వారిపై పోలీసు కేసు కూడా న‌మోదు చేశామన్నారు.