చెత్త పన్నుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-ఉక్కునగరం : చెత్త పన్నును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన జివిఎంసి 86వ వార్డు పరిధిలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచిపెట్టారు. వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుతున్న పన్నులను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. చెత్త పన్ను కట్టకుండా తిరస్కరించాలని, మౌలిక సదుపాయాలైన నీరు, డ్రెయినేజీలు, విద్యుత్ తదితర సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, శ్రీనివాసరాజు, గంగాధర్, సూరిబాబు, దత్తు, పూర్ణ, రాజు, కృష్ణార్జున, ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










