
సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న శిరీషా రాణి
ప్రజాశక్తి -నక్కపల్లి:చెత్త రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలని జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషా రాణి అన్నారు. గురువారం నక్కపల్లిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం (లోకల్ ట్రైనింగ్ సెంటర్ ) వేంపాడులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ను సందర్శించారు. నక్కపల్లి కేంద్రంలో వర్మి కంపోస్టును పరిశీలించారు. సంపద కేంద్రం ద్వారా సంపదను సృష్టించుకోవాలన్నారు. కేటాయించిన మండలాలకు శిక్షణ పక్కాగా నిర్వహించాలని సూచించారు. వేంపాడులో చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను సందర్శించి, మరింతగా నిర్వహణ చేయాలని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారామరాజు, పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, శ్రీను పాల్గొన్నారు.