Nov 20,2022 00:08

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-గాజువాక : జివిఎంసి 76వ వార్డు పరిధి రామచంద్ర నగర్‌ రిక్షా కాలనీలో వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి బలవంతంగా చెత్త పన్ను వసూలు చేయడం అన్యాయమని, దీన్ని ఆపాలని సిఐటియు ఆధ్వర్యాన శనివారం వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటినాయకులు ఎం.రాంబాబు మాట్లాడుతూ, రిక్షా కాలనీలో వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి బలవంతంగా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయడం అన్యాయం అన్నారు. సంవత్సరానికి రూ.750 కట్టాలని చెప్పడం దుర్మార్గమన్నారు. చెత్త పన్ను రద్దు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ కార్యదర్శి డి రమణ, రాముడు, జనార్ధన, రాజారావు, త్రినాధ్‌ పాల్గొన్నారు.