ప్రజాశక్తి -యంత్రాంగం
చెత్తపన్ను, పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన పలు సచివాలయాల వద్ద గురువారమూ నిరసనలు కొనసాగాయి.
మధురవాడ : జివిఎంసి 5వ వార్డు పరిధి 67వ సచివాలయం వద్ద సిపిఎం మధురవాడ జోన్ కమిటీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మధురవాడ జోన్ కమిటీ కార్యదర్శి డి.అప్పలరాజు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ఆపేస్తామని లబ్ధిదారులను, టార్గెట్ ప్రకారం వసూళ్లు చేయలేదని సచివాలయ సిబ్బందిని వేధింపులకు గురిచేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.కొండమ్మ, కె.సుజాత, డి.తులసి, ఎం.కనకరత్నం, కె.పుష్ప, ఎం.నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాధవధార : మాధవధార సచివాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం సచివాలయ అడ్మిన్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సనపల రామ్‌గోపాలరావు, అమలమ్మ, జనార్ధనమ్మ, అనురాధ, పార్వతి, శ్రీదేవి, లలిత, జిఎన్.మూర్తి, గోపాలకృష్ణ, రామారావు, రాజశేఖర్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : సిపిఎం ఆరిలోవ జోన్ కమిటీ ఆధర్యాన 12, 13 వార్డుల సచివాలయాల వద్ద నిరసన తెలిపారు. సిపిఎం, ఐద్వా నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని, చెత్తపై యూజర్ చార్జీలు రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.శంకరరావు, బి.సూర్యమణి, ఎస్.రంగమ్మ, కాంత, ఎర్రయ్యమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : కూర్మన్నపాలెం సమీపంలోని పకీర్‌తకియా, 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెంలో సచివాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాసరాజు, వివి రమణ, ఎన్.రామారావు, జి.గంగాధర్, దత్తాత్రేయ, విడివి.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : 94వ వార్డు పరిధి సప్త అప్పలనరసయ్య కాలనీ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిరుపతిరావు, అప్పలనాయుడు, సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.










