ప్రజాశక్తి -గాజువాక : చెత్త పన్నును తక్షణమే రద్దు చేయాలని సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన భానోజీ తోట నుంచి కొత్త గాజువాక మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెత్త పన్నును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇంటి పన్నుతో కలిపి చెత్త పన్ను చెల్లించాలని ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్.నాగేశ్వరరావు, ఎం.నాగేశ్వరరావు, టి.శ్రీనివాస్, బి.శ్రీనివాస్, బి.తిరుపతి పాల్గొన్నారు.
కంచరపాలెం : చెత్త పన్నును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన జివిఎంసి 56వ వార్డు పరిధి గొల్ల కంచరపాలెం, తోటవీధి ప్రాంతాల్లో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ సెక్రటరీ బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ, చెత్త పన్నును ప్రజల నుంచి ఎలాగైనా వసూళ్లు చేసే ప్రయత్నం జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి చెత్తపన్నును నిరాకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్.సోమేశ్వరరావు, బి.ప్రసాద్, ఒ.అప్పారావు, ఎమ్.ఈశ్వరరావు, అప్పలరావు, సింహాచలం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










