Aug 25,2022 23:12

చెత్త పన్ను రద్దు చేయాలని ర్యాలీ చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- ములగాడ : చెత్త పన్ను రద్దుచేయాలని కోరుతూ జివిఎంసి 63వ వార్డు పరిధి కాకర్లలోవలో సిపిఎం ఆధ్వర్యాన గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మల్కాపురం జోన్‌ నాయకులు కె.పెంటారావు మాట్లాడుతూ, చట్టవిరుద్ధంగా వేస్తున్న చెత్త పన్ను విషయమై కోర్టులో కేసు ఉండగా జివిఎంసిలో ఎలా తీర్మానం చేస్తారని ప్రశ్నించారు. ఇంటి పన్నుకు ముడిపెట్టి చెత్త పన్ను వేయడం దుర్మార్గమన్నారు. ఈ చర్యలు ఆపకుంటే ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. చెత్త పన్నుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని అర్థం చేసుకొని రద్దు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో ఎ.రమణ, జి.నీలయ్య, ఎస్‌.రాజు, కె.రాము, సాయికృష్ణ, హరి, పి.శంకర్‌, జి.నరేష్‌, ఎస్‌.వాసు పాల్గొన్నారు.