Aug 29,2022 23:59

పాదయాత్ర చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -ములగాడ : చెత్తపన్నును ఇంటిపన్నుతో ముడిపెట్టిన వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌లో సిపిఎం ఆధ్వర్యాన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కె.పెంటారావు మాట్లాడుతూ, ఇంటి పన్నుతో చెత్త పన్ను కలిపి కట్టాలని వైసిపి చేసిన నిర్నయాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. చెత్త పన్ను రద్దు చేసే వరకూ ఈ పోరాటం ఆగదన్నారు. 58వ వార్డు పరిధి గుల్లలపాలెం, 59వ వార్డు పరిధి ములగాడ హౌసింగ్‌ కాలనీ, ఎక్స్‌ సర్వీస్‌ మేన్‌ కాలనీ, 62వ వార్డు పరిధి త్రినాధపురం ప్రాంతాల్లో పాదయాత్రలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో జోన్‌ నాయకులు ఆర్‌.లక్ష్మణమూర్తి, పిసిని రామారావు, టి.అప్పారావు, బి.శ్రీను, కె.రమణ, ఎస్‌.వాసు, జి.నరేష్‌, కొల్లి రాము, నీలయ్య, ఎస్‌ఎస్‌.అప్పారావు, డి.ప్రేమ్‌, ఈశ్వరరావు, వై.లక్ష్మణ్‌, ఆనంద్‌, ఎం.విష్ణు, ఎస్‌.గౌరి, ఆర్‌.వెంకటేష్‌ పాల్గొన్నారు.
గాజువాక : స్వతంత్ర నగరంలో చెత్త పన్ను రద్దు చేయాలని పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్‌ కార్యదర్శి రాంబాబు, కమిటీ సభ్యులు జి.లక్ష్మి, బి.రమణ, కె.నాగేశ్వరరావు, అన్నపూర్ణ, గాయత్రి, రావులమ్మ పాల్గొన్నారు.