Sep 07,2022 23:00
పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం నేతలు

పాదయాత్రలో సిపిఎం నేతల అవగాహన
ప్రజాశక్తి-పెందుర్తి :
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, జివిఎంసి ముక్కుపిండి వసూలు చేయాలని చూస్తున్న చెత్తపన్నును ఎవరూ చెల్లించవద్దని సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి, ఇతర నేతలు సూచించారు. బుధవారం 94, 97 వార్డుల పరిధిలో చైతన్యనగర్‌, అప్పలనరసయ్య, వీరనగర్‌, గాంధీనగర్‌, కాలనీలలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ చెత్తపన్ను చెల్లించొద్దంటూ సిపిఎం చేస్తున్న ప్రచారంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు చైతన్యవంతులై చెల్లించడం లేదని, ఇంకా ఎవరైనా ఉంటే మున్ముందు చెల్లించవద్దని సూచించారు. సమస్యలేమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజల పక్షాన సిపిఎం పోరాడుతుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డివిజన్‌ కమిటీ సభ్యులు డి.లావణ్య, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు