Apr 27,2023 01:58

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాన్ని బుధవారం బాపట్ల మండలం పూండ్ల గ్రామ పంచాయతీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శి జే మరియమ్మ మాట్లాడుతూ వర్మి కంపోస్టు తయారు చేసి సరఫరా చేస్తున్నానని, వాన పాములు ఇతర పంచాయతీలకు కేజి రూ.50 చొప్పున అందిస్తున్నామని అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో ప్రథమ స్థానంలో పూండ్ల గ్రామం ఉందన్నారు. పరిశుభ్రత హరిత గ్రామ పంచాయతీ క్రమంలో రెండో స్థానంలో ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నన్నం నరసింహారావు, సచివాలయం కన్వీనర్‌ మహేంద్ర, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ నాగేంద్ర, నాయకులు చాంద్‌ బాషా, వైసిపి గ్రామ కన్వీనర్‌ రత్తయ్య పాల్గొన్నారు.
చెత్త సంపద కేంద్రంలో అధికారులు