Sep 20,2023 22:34

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరంలో చెత్త డంపింగ్‌ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం గన్నవరం పంచాయతీ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా నాయకులు పెద్దు వాసుదేవరావు, సిపిఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ... ఆగిరిపల్లి రోడ్డులో చెత్తను పారవేయడం వల్ల తీవ్రదుర్గంధం వెదజల్లుతూ 10 గ్రామాల ప్రజలు అటుగా వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. గతంలో చెత్తను ఈ విధంగానే పోసి దానిని వలన పల్లి తరలించేందుకు 25 లక్షల రూపాయలు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అదే పని చేయడానికి లక్షల రూపాయలు వ్యయం చేయడానికి అధికారులు సిద్ధమవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని గొల్లనపల్లి ఏరియాలో పంచాయితీకి పర్మినెంట్గా రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు వారి గోతులు కేటాయించి ఇస్తే సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుందని తెలిపారు. ఆ పని త్వరగా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సర్పంచ్‌ కి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్‌ సౌజన్య మాట్లాడుతూ.. ఈ సమస్యను జిల్లా అధికారులు దృష్టిలో పెట్టడం జరిగిందని త్వరలోనే చెత్తను బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పఠాన్‌ సర్దార్‌, మల్లంపల్లి జయమ్మ, సాంబశివరావు, మిరప నాగేశ్వ రరావు, కే వెంకటేశ్వరరావు, సిహెచ్‌ వెంకటేశ ్వరరావు తదితరులు పాల్గొన్నారు.