Aug 09,2023 20:52

మంత్రాలయంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
చెట్లు, సైనికులు ప్రజల రక్షణలో భాగస్వామ్యులని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని రాంపురం గ్రామంలో 'నా భూమి - నా దేశం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెట్లు వాతావరణ కాలుష్యాన్ని నివారించి సకాలంలో వర్షాలు కురిసేందుకు, ఆక్సిజన్‌ అందించేందుకు దోహదపడతాయని తెలిపారు. సైనికులు దేశ సరిహద్దుల్లో రక్షణ కల్పించి ఊపిరి పోస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని నినాదాలు చేసి గౌరవ వందనం సమర్పించారు. ఎమ్మెల్యే సెల్ఫీ ఫొటో తీసుకున్నారు. వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ నారాయణ మూర్తి, ఎస్‌ఐ కిరణ్‌, ఎఇ నరసింహులు, ఎపిఎం జయశ్రీ, ఎంఇఒ మోహినుద్దీన్‌, ఎపిఒ తిమ్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఇస్రాత్‌ బాష పాల్గొన్నారు. గోనెగండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో మొక్కలు నాటారు. చిన్న మరివీడు, అల్వాల గ్రామాల్లో డిపిఒ నాగరాజు నాయుడు పాల్గొని 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా అల్వాల సర్పంచి బాష, చిన్నమరివీడు సర్పంచి శిరోమణమ్మతో కలిసి 75 మొక్కలు నాటారు. మాతృభూమికి వందనం సమర్పించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో అమరులైన వీరులకు వందనం సమర్పించారు. అనంతరం పాఠశాలల చిన్నారులు, అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గోనెగండ్ల ఎంపిడిఒ కార్యాలయం వద్ద సర్పంచి హేమావతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, జెడిఎ వరలక్ష్మి పాల్గొన్నారు. ఇన్‌ఛార్జీ ఎంపిడిఒ నగేష్‌, ఏపీడీ అలీ పీరా, ఈసీ ఉస్మాన్‌ బాష పాల్గొన్నారు.

గోనెగండ్లలో మొక్కలు నాటుతున్న డిపిఒ
గోనెగండ్లలో మొక్కలు నాటుతున్న డిపిఒ