Apr 24,2023 00:07

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నర్సింగరావు

ప్రజాశక్తి -గాజువాక : గాజువాక పాతకర్ణవానిపాలెంలోని బిజెపి సాహితీ సంస్థ అధినేత కరణంరెడ్డి నరసింగరావు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ, మే 6,7 తేదీల్లో వికాస్‌నగర్‌ ఆర్‌జిఐ స్టేడియంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అంధులు, వికలాంగులకు ప్రత్యేకంగా చెస్‌ పోటీలను ఎబిసి ట్రస్ట్‌, ఎఎన్‌ఆర్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యాన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగ వైకల్యం ఆటలకు ఆటంకం కాకూడదని, మనోధైర్యంతో అందరూ ప్రతిభ చాటాలని ఆయన పిలుపు నిచ్చారు. మూడు కేటగిరీల్లో విజేతలకు ఒక్కొక్కరికి రూ.40 వేలు చొప్పున నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రంజిత్‌ శ్రీను, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.