Dec 22,2022 00:05

అరుణకు చెక్కు అందజేస్తున్న దొరస్వామి

ప్రజాశక్తి-అచ్యుతాపురం
చెస్‌ బాక్సింగ్‌ క్రీడాకారిణి కోరుకొండ అరుణకు బ్రాండిక్స్‌ సంస్థ లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి బాసటగా నిలిచింది. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంకు చెందిన అరుణ వరల్డ్‌ చెస్‌ బాక్సింగ్‌ పోటీల్లో సత్తా చాటి బంగారు పతాకాన్ని సాధించింది. గ్రామీణ కుటుంబంలో జన్మించి.. పేదరికాన్ని అధిగమించి ఘన కీర్తిని చాటుతున్న అరుణకు బ్రాండిక్స్‌ సంస్థ భారతీయ భాగస్వామి దొరస్వామి లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్‌ యువతకు, ముఖ్యంగా మహిళలు క్రీడలతో సహా అన్ని రంగాల్లో రాణించేందుకు చేయూత ఇచ్చేందుకు ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అరుణ అంతర్జాతీయ చెస్‌ బాక్సింగ్‌లో తన ప్రతిభను చాటుకుని ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్‌ సంస్థ ప్రతినిధులు శరవణన్‌, ఉదిత వీరబాహు, చరిత తదితరులు పాల్గొన్నారు.