
శారదానగర్‌లో జలమయమైన వీధి
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్: కొద్దిపాటి వర్షం వస్తే చాలు పట్టణంలో వీధులు, డ్రైనేజీలు చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి అబీద్ సెంటర్ నుండి పాల్గాట్ సెంటర్ వరకు రోడ్లు జలమయమయ్యాయి. శారదానగర్ బొంబాయి టైలర్ వీధి మురుకువాడలను తలపించేలా మారింది. మున్సిపాల్టీ ప్రదాన రహదార్లలో సరైన డ్రైనేజి లేక పోవడం, ఉన్న డ్రెయినేజీలో పూడికలు తీయక పోవడంతో చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ మురుగు నీరుతో ఏరులై పారుతున్నాయి. చెత్తా, చెదారం ఇళ్ళలోకి వస్తుంది. పాలకులు మారినా నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృదికి నోచుకోవలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన పాలకులు, అదికారులు కనీసం డ్రైనేజిల అబివృద్ధిపై దృష్టి పెట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు కోరారు.