Nov 13,2023 21:52

చెరువుకు పడిన గండిని పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - సీతానగరం : మండలంలోని రామ వరం వద్ద మాది నాయుడు చెరువు సోమవారం గండి పడింది. దీంతో కోసిన వరిసేలు తడిచిపోగా, చెరువు లో చేపలు బయటకు పోతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు చెరువు గండిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో గండిని పూడ్చి రైతులను, మత్స్య కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వపరంగా పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల ప్రసన్నకుమార్‌ గ్రామ సర్పంచ్‌ పెంట సత్యనారాయణ, మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు, ఆర్‌.వేణుగోపాలనాయుడు, పోలా సత్యనారాయణ, పెద్దబ్బాయి, సురేష్‌తో పాటు రైతులు ఉన్నారు