చెరువు అభివృద్ధి పనులపై తెలుసుకుంటున్న డిపిఒ శిరీషరాణి
ప్రజాశక్తి - కశింకోట
చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శిరిషరాణి ఆదేశించారు. మండలంలోని ఉగ్గినపాలెంలో చెరువు అభివృద్ధి పనులను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువు గర్భంలో ఎంత నీరు చేరుతుందో తెలుసుకున్నారు. గట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. అనంతరం తాళ్ళపాలెం చెరువు, చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌పిపి కలగా లక్ష్మి, సర్పంచ్ కలగా గున్నయ నాయుడు, ఎమ్‌పిడిఓ కొంకి అప్పారావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు










