ప్రజాశక్తి-ముప్పాళ్ల : మాదల సిపిఎం వ్యవస్థాకులు చెరుకూరి శ్రీరాములు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ మండల కార్యదర్శి జి.బాలకృష్ణ అనానరు. శ్రీరాములు 28 వర్ధంతి సభను గ్రామంలోని శ్రీరాములు స్తూపం వద్ద నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన శ్రీరాములు నిరంతరం ప్రజా సమస్యలపై పని చేశారని, ఉపసర్పంచ్‌గా అనేక సేవలందించి ప్రజల మన్ననలను పొందారని చెప్పారు. ఏ సమస్య వచ్చిన రాజకీయాలకు అతీతంగా పరిష్కరిండచలో ముందున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి అధికారాన్ని కాపాడుకునే పనిలో పడ్డాయని, కుల, మత చిచ్చులు పెడుతున్నాయని విమర్శించారు. ప్రజలపై భారాలు వేయడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.వెంకటరెడ్డి, సిహెచ్.నాగమల్లేశ్వరరావు, జి.జాలయ్య, ఐ.వెంకటరెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీరాములు కుటుంబీకులు, స్థానికులు పాల్గొన్నారు.










