Jun 30,2023 01:06
గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి

ప్రజాశక్తి-చెరుకుపల్లి: చెరుకుపల్లిలో రెండో రోజు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. సిసి రోడ్లు కావాలని, పక్కా గృహాలు మంజూరు చేయాలని, డ్రైనేజీ సమస్య తీర్చాలని, పలు సమస్యలను ప్రజలు మోపిదేవి దృష్టికి తీసుకురాగా ఆయన వీలైనంత త్వరగా సమస్యలు అన్ని తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దేవరకొండ వాణి, జడ్పిటిసి సభ్యులు మర్రివాడ వెంకట పావని ప్రసాద్‌, ఎంపీపీ రత్నప్రసాద్‌, చేనో కోటేశ్వరరావు, కామినేని కోటేశ్వరరావు, బండారు రామారావు, రావూరి శివ నాగేశ్వరరావు, చీరాల ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.