ప్రజలతో మోపిదేవి
ప్రజాశక్తి-చెరుకుపల్లి: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తు న్నామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం చెరుకుపల్లి పట్టణంలో మొదటిరోజు గడప గడపకూ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరిస్తామని మోపిదేవి ప్రజలకు హామీ ఇచ్చారు. నవరత్నాలు పథకాలు ప్రజలకు వివరించి తమకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రత్న ప్రసాద్, జడ్పిటిసి మర్రివాడ వెంకట పావని ప్రసాద్, మాజీ ఎంపీపీ చెన్ము కోటేశ్వరరావు, బండారు రామారావు, గ్రామ సర్పంచ్ దేవరకొండ వాణి, రావూరి శివ నాగేశ్వరరావు, తూము నాగ కోటేశ్వరరావు, ఎమ్మెస్సార్ తదితరులు పాల్గొన్నారు.










