Oct 18,2023 22:30

ప్రజాశక్తి-పాలసముద్రం: తాను చెప్పినట్లు నడుచు కోవాలి లేకుంటే మండలం విడిచి వెళ్లిపోవాలని వైస్‌ ఎంపిపి శేఖర్‌ మందడి పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణపై మండిపడ్డారు. బుధవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో మండల సర్వ సభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎంపిపి శ్యామల అధ్యక్షత వహించారు. వనదు ర్గావురం పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ, డిజిటల్‌ అసిస్టెంట్‌ మనీష్‌లపై వైస్‌ ఎంపిపి మండిపడుతూ బెంగళూరులో ఉన్న ఓ వ్యక్తి చెబితే వింటారు..నేను చెబితే కుంటి సాకులు చెబుతారా అంటూ మండిపడ్డారు. విషయాన్ని డిప్యూటి సిఎం దృష్టికి తీసుకెళతానన్నారు. గంగమాంబపురం సర్పంచ్‌ హరి మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలు ఎతు ్తకెళ్లారని నెల ముందు చెబితే ఇంతవరకు విద్యుత్‌ అదికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. నర సింహపురం సర్పంచ్‌ రమేష్‌ మాట్లాడుతూ తమ గ్రామంలో పాఠశాల లేకపోవడం వల్ల 40మంది పిల్లలు ప్రయివేటు పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, సమస్యను గడిచిన మూడు సమావేశాలలో లేవనెత్తినా విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తహశీల్దార్‌ బాబు మాట్లాడుతూ వనదుర్గాపురంలో శవాన్ని అడు ్డకోవడం బాధాకరమని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడాన్ని 50సెంట్లు భూమిని పంచాయితీకి శ్మశాన వాటికకు అప్పగించామన్నారు. ఆ స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపిపి శ్యామల మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సమస్యలను పది రోజుల లోపు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్‌ రాజ్‌కుమార్‌, జడ్పిటిసి అన్బుగలన్‌ తదితరులు పాల్గొన్నారు.