May 18,2021 17:25

వేసవిలో తీవ్రమైన ఎండ వేడిమికి శరీరంపై చెమటకాయలు రావడం సహజం. కొన్ని చిట్కాలను ఉపయోగించి వాటి నివారణకు ప్రయత్నించవచ్చు.
- చల్లటి పాలలో దూదిని ముంచి చెమటకాయలపై రాస్తే మంట తగ్గుతుంది.
- కలబంద గుజ్జును చెమట కాయలపై రాస్తే సమస్య తగ్గుతుంది. కలబందలోని ఆస్ట్రిజెంట్‌.. చెమట కాయలను నిర్మూలించడంలో మెరుగ్గా పనిచేస్తుంది.
- ఆముదంలో యాంటీసెప్టిక్‌ గుణాలు ఎక్కువ. ఆముదంలో దూది ముంచి రాస్తే చెమట కాయల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- జీలకర్ర పొడిలో నీళ్లు పోసి పేస్టులా చేసుకుని చెమట కాయలపై రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
- వెనిగర్‌లోని అసిటిక్‌ యాసిడ్‌కు చర్మాన్ని సంరక్షించే గుణం ఉంది. కాబట్టి వెనిగర్‌లో కాస్త దూదిని ముంచి చెమట కాయలు ఉన్న చోట రాయండి. కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
- ఓట్స్‌ను పొడిగా చేసుకుని గోరు వెచ్చని నీటిలో కలపడండి. దాన్ని చెమట కాయలపై రాసి, 20-30 నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం ఉంటుంది.
- గంధంలో రోజ్‌ వాటర్‌ కలిపి చెమటకాయలకు రాస్తే చాలా ఉపశమనంగా ఉంటుంది.
- బ్లాక్‌ టీ, లవంగ నూనె రాయడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.
- శరీరానికి చలవ చేసే మజ్జిగ, సబ్జా, బార్లీ నీళ్లను తాగడం వల్ల కూడా చెమట కాయలు తగ్గుముఖం పడతాయి.
- కొన్ని ఐస్‌ ముక్కలను శుభ్రమైన బట్టలో వేసి చెమట కాయలపై రుద్దితే మంచి ఫలితం కనిపిస్తుంది.