రాయచోటి : జిల్లాలోని ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఎన్‌హెచ్ 71, ఎన్‌హెచ్ 42కు సంబంధించి పరిహారం చెల్లింపులను వేగవం తంగా పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని ముదివేడు బ్యాలెన్స్ రిజర్వా యర్, ఎన్‌హెచ్ 71, ఎన్‌హెచ్ 42 పరిహారం చెల్లింపు ప్రగతిపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తంగా 1074.63 ఎకరాలు అవసరం కాగా వందశాతం భూసేకరణ చేశారని చెప్పారు. పరిహారం, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఎస్‌డిసి సంబంధిత తహశీలార్లను ఆదేశించారు. ఎన్‌హెచ్ 71 మదనపల్లి నుంచి పీలేరు నాలుగు వరసల జాతీయ రహదారికి సంబంధించి 234.44 హెక్టార్లు భూసేకరణ పూర్తి చేశారని, ఇందుకు మొత్తంగా రూ.141.92 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.117.58 కోట్లు లబ్ధిదారులకు పరిహారం పంపిణీ చేశారన్నారు. ఇంకను రూ24.34 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. ములకలచెరువు నుంచి మదనపల్లి ఎన్‌హెచ్-42 కు సంబంధించి 45.037 హెక్టార్లకు 41.85 హెక్టార్లు భూసేకరణ చేయగా మిగిలిన 2.187 హెక్టార్లు కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉందన్నారు. కోర్టు కేసును త్వరితగతిన ముగించేలా అధికారులు కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా రూ.82.30 కోట్లు పరిహారానికి గాను రూ. 71.93కోట్లు చెల్లింపు చేశారని ఇంకనూ కేవలం రూ.10.37 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని వారం వారం తప్పనిసరిగా ప్రగతి సాధించాలని తెలిపారు. ఆయా ప్రాజెక్టులలో భూసేకరణ పూర్తయినందున సహాయ పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలలో కలెక్టర్ తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒ మురళి, హెచ్‌ఎంఎస్‌ఎస్ యూనిట్-2 ఎస్‌డిసి గోపాలకష్ణ, సంబంధిత తహశీల్దాలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గిరీష