Oct 28,2022 23:28

ప్రశ్న పత్రాలు పంపిణీ చేస్తున్న జెవివి ప్రతినిధులు

ప్రజాశక్తి-మాడుగుల:చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ శుక్రవారం మండలంలో ప్రారంభం అయ్యింది. 28 నుండి 2 వరకు పాఠశాల స్థాయి, నవంబర్‌ 18 మండల స్థాయి, డిసెంబర్‌ 11,12 తేదీల్లో జిల్లా స్థాయి, జనవరి 8,9 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరగనున్నాయి. శుక్రవారం పాఠశాలల స్థాయిలో జరిగిన టెస్టులో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మాడుగుల ఆర్‌సిఎం పాఠశాలలో ప్రారంభం కాగా ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మాడుగుల డివిజన్‌ కమిటీ అధ్యక్షులు సురేష్‌ శాంతో, ప్రధాన కార్యదర్శి తాళపు రెడ్డి నాగచంద్ర, కార్యదర్శి జాగాని ఈశ్వరరావు, చంద్రశేఖర్‌, హెచ్‌ఎం సుజాత డొమినిక్‌, ఉపాధ్యాయులు సుజాత, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.