ప్రజాశక్తి-మాడుగుల:జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ శుక్రవారం నిర్వహించారు. గత నెల 28 న పాఠశాలల స్థాయిలో ఈ పోటీలు నిర్వహించగా, అర్హత సాధించిన మాడుగుల, చీడికాడ, బుచ్చయ్యపేట మండలాలకు చెందిన విద్యార్థులకు మండల స్థాయి పోటీలు స్థానిక వీనస్ కోచింగ్ సెంటర్‌లో నిర్వహించారు. పాఠశాలల స్థాయిలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలతో పాటు నమ్మకాలు వాస్తవాలు, సైన్స్ నిజాలు, స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్ర పుస్తకాలు పంపిణీ చేశారు.
న్యాయవాది శ్రీనాథు ప్రసాదరావు, మాడుగుల వర్తక సంఘం, హై స్కూల్ హెచ్‌ఎం బివి జగన్నాథం సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక డివిజన్ కమిటీ అధ్యక్షులు సురేష్ శాంతో, ప్రధాన కార్యదర్శి తాళపు రెడ్డి నాగచంద్ర కార్యదర్శి, గౌరీ పట్టపు మహేష్, ఉపాధ్యక్షులు జాగాని ఈశ్వరరావు, కోశాధికారి గొట్టాలు చిన్నం నాయుడు పాల్గొన్నారు.










