Dec 11,2022 23:52

బహుమతులు ఇస్తున్న జెవివి ప్రతినిధులు

ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం:మండల కేంద్రంలోని వినరు విద్యా సంస్థలో అంగరంగ వైభవంగా చెకుముకి సైన్స్‌ సంబరాలు జరిగాయి. 20 మండలాల నుండి 150 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. చెకుముకి సైన్స్‌ సంబరాల్లో ప్రధమ బహుమతి మాకవరపాలెం గిడుతురు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ద్వితీయ బహుమతి ఏపీ మోడల్‌ స్కూల్‌ (వేములపూడి) సాధించాయి. ప్రైవేట్‌ పాఠశాల నుండి మొదటి బహుమతి శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌, ద్వితీయ బహుమతి భవాని విద్యానికేతన్‌ (అచ్యుతాపురం) గెలుచుకున్నాయి. మొదటి స్థానం సాధించిన వారు కడపలో జరుగు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర అధ్యక్షులు కే.త్రిమూర్తులు, వెంకటేశ్వర మాస్టారు, వినరు విద్యా సంస్థల కరస్పాండెంట్‌ బత్తులు వాసు, పాల్గొన్నారు.