Nov 21,2022 22:53

ప్రజాశక్తి-చందర్లపాడు
చందర్లపాడు మండల స్థాయిలో చెకుముకి సైన్స్‌ సంబరాలు సొమవారం నిర్వహించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చందర్లపాడు ప్రధానోపాధ్యాయులు కె.రఘునాథ్‌ ప్రసాద్‌ ప్రశ్న పత్రాలను విడుదలచేశారు. ఈ సందర్భంగా రఘునాథ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్‌ పరిజ్ఞానాన్ని పెంచటానికి, మూఢనమ్మకాలనుంచి విముక్తి చేయడానికి జనవిజ్ఞానవేదిక ఎంతో కాలం నుంచి కషి చేస్తూ విద్యార్థుల్లో సైన్సు పట్ల ఆసక్తిని పెంచుతున్నారని అభినందిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఐ.సత్యం,చందర్లపాడు మండల జనవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ గంగరాజు పాల్గొన్నారు.