Oct 25,2023 21:46

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్‌ సంబరాలకు సంబంధించిన పోస్టర్‌ను డిఇఒ ఎస్‌.అబ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎం.మల్లిఖార్జునరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయి పరీక్ష నవంబర్‌ 10న, మండల, పట్టణ స్థాయి చెకుముకి పరీక్షలు నవంబర్‌ 30, జిల్లా స్థాయి పరీక్ష డిసెంబర్‌ 17న, రాష్ట్రస్థాయి పరీక్ష జనవరి 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతాయని వివరించారు. చెకుముకి పరీక్షకు 8, 9, 10 తరగతి విద్యార్థులందరూ అర్హులని, ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో ఉంటుందని తెలిపారు. చెకుముకి పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరై సైన్స్‌ పట్ల అభిరుచి పెంచుకోవడానికి కృషి చేయాలని, ఇందుకు ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం జనవిజ్ఞాన వేదిక కోశాధికారి ఎన్‌ .రవిబాబు సెల్‌ నెంబర్‌ 9949135822ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఇఒ నారాయణ, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ చైతన్య శేఖర్‌, తాతారావు, బివి.ఆనంద్‌, నిశ్చల్‌ తదితరులు పాల్గొన్నారు.