చెకుముకి సైన్స్ పరీక్షల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి - గూడూరు రూరల్ : గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద చెకుముకి సైన్స్ పరీక్షల గోడపత్రికలను జెవివి సభ్యులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెవివి అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడు తూ ప్రజల్లో మూఢ నమ్మకాలు పోవాలనే ఉద్దేశంతో విద్యార్థి దశనుండే చైతన్యం రావాలని విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు గత 32సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చెకుముకి సైన్స్ పరీక్షలు పాఠశాల స్థాయిలో ఈ నెల10వ తేదీ మండల స్థాయిలో, 30వ తేదీ జిల్లా స్థాయిలో, డిసెంబర్17న , రాష్ట్ర స్థాయిలో జనవరి 2024, 27, 28వ తేదీ జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెవివి అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్, పురుషోత్తమ రావు, రామమోహన్, సాయికిరణ్, గుర్రం విజయబాబు, విష్ణు, కటకం శ్రీను, నక్కా గోపి, పవన్ పాల్గొన్నారు.










