ప్రజాశక్తి-మాడుగుల:రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు మాడుగులకు చెందిన వీనస్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న బాలికలు అర్హత సాధించారు. వీరిలో కోన కావ్యశ్రీ, ఎం.శరణ్య (కింతలి జెడ్పి ఉన్నత పాఠశాల) ఆడారి మోహన ప్రియ (మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాల), మామిడి లికిత ( మాడుగుల ఆర్‌సిఎం పాఠశాల)లు జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించడంతో ఈనెల 21, 22 తేదీలలో కడప జిల్లాలో జరగనున్న రాష్ట్ర పోటీలకు హాజరు కానున్నారు. వీరికి వీనస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తాలపు రెడ్డి నాగచంద్ర శిక్షణ ఇచ్చారు. వీరికి జన విజ్ఞాన వేదిక మాడుగుల డివిజన్ కమిటీ అధ్యక్షులు సురేష్ శాంతో, ప్రధాన కార్యదర్శి తాళపు రెడ్డి నాగచంద్ర, ఉపాధ్యక్షులు జాగాని ఈశ్వరరావు, కార్య దర్శి గౌరీపట్నపు మహేష్, కోశాధికారి చిన్నం నాయుడు అభినందనలు తెలిపారు.










