ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబుకు మద్దతుగా టిడిపి ఆధ్వర్యాన చేతులు కట్టుకుని ఆదివారం పలుచోట్ల నిరసనలు తెలపారు. కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మీ సత్యనారాయణ మూర్తి చంద్రబాబు క్షేమం, విడుదల కోరుతూ కొవ్వాడ గ్రామంలోని మసీద్, చీడిగ చర్చి, ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడిలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంద్రపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి చేతికి నల్ల రిబ్బన్ లు బేడీలుగా కట్టుకొని న్యాయానికి సంకెళ్ళా అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రౌతులపూడిలో టిడిపి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్య ప్రభ ఆధ్వర్యంలో రిబ్బన్, తాళ్లతో చేతులు కట్టుకుని నిరసన తెలిపారు. గుమ్మరేగుల సెంటర్ నుంచి శివాలయం వరకు మెయిన్ రోడ్ మీదగా పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో పైల సాంబశివరావు, భాస్కర బాబు, టిడిపి మండల అధ్యక్షులు సత్యనారాయణ, బద్ది రామారావు, ఎంపిటిసి సోమరౌతు రవి, సురేష్ పాల్గొన్నారు. గండేపల్లి గ్రామంలో బాబుతో నేను కార్యక్రమాన్ని టిడిపి ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలసి గ్రామంలో ఆయన ఇంటింటికి పర్యటించి టిడిపి హయాంలో చేపట్టిన పథకాలను వివరించారు. జగ్గంపేట రూరల్ మర్రిపాకలో బాబుతో నేను కార్యక్రమంలో కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి మండల అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, బస్వా చినబాబు ఆధ్వర్యంలో ఇంటిఇంటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి.మారుతి, కె.నూకాపతి, కె.సత్యనారాయణ, కె.బాబూరావు, కె.వెంకటరమణ, రెడ్డి ఆంజనేయులు, కొసన ప్రకాశం, కె.అమ్మిరాజు, ఎ.శివ, కె.అప్పారావు, వి.లోవరాజు, జగతం వెంకటేశ్వర్లు, జక్కి ఆంజనేయులు, తండు శ్రీను, మోర అప్పలకొండ, గండి కొండ, కె.చిన్న రాముడు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు పోలేకుర్రు పంచాయతీ చినబాపనపల్లి, తూర్పుపేట, సుంకటరేవులో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, ధూళిపూడి వెంకటరమణ, మందాల గంగ సూర్యనారాయణ, జక్కల ప్రసాద్ బాబు, మోర్త భైరవమూర్తి, మోపూరి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల మూర్తి, వడ్లమూడి సతీష్, పలివెల అప్పారావు, వస్కా రెడ్డి, బోయిడి వేణుగోపాల్, దాసరి వేణుగోపాల్, గంటాగోపి తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ బోయినపూడి, సామర్లకోట మటన్ సెంటర్ వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున న్యాయానికి సంకెళ్లు అంటూ చేతికి నల్ల రిబ్బన్లు కొబ్బరి తాళ్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. బోయినపూడిలో, హుస్సేన్‌పురంలో బాబుతో నేను కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్, టిడిపి నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే బాబు తాతపూడి అరుణ్ వంశీ, గుండు రాజు, బాడితిమాని త్రిమూర్తులు, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, శ్రీను బాబు, గుమ్మళ్ల రామకష్ణ, తోటకూర శ్రీనివాస్, ఆకునూరి సత్తిబాబు, అడ్డాల వెంకనబాబు, చికట్ల వెంకటేష్, పెంకే వెంకటేష్, ముసిరెడ్డి శ్రీరాములు, కుర్ర రాజు, కష్ణారావు, వెన్నా దివానం పాల్గొన్నారు.










