
చేతుల శుభ్రతపై వివరిస్తున్న మహిళలు
ప్రజాశక్తి-అద్దంకి: పట్టణంలోని బిలీవర్స్ చర్చ్ ఆధ్వర్యంలో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రజలకు అనేక సూచనలు, సలహాలు ఒంగోలు మిషన్ ప్రొవిన్స్ స్త్రీల సహవాస నాయకురాలు కరుణ జ్యోతి తెలియ జేశారు. స్త్రీల సమాజం పాల్గొని అనేక విషయాలు నేర్చుకున్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.